Tirumala: ధనుర్మాసం ప్రారంభం శ్రీవారికి సుప్రభాత సేవ స్థానంలో ‘తిరుప్పావై ‘

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం అందించింది. శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది ధనుర్మాసం. 16వ తేదీన ప్రారంభం కానుంది. ధనుర్మాస ఘడియల నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం… పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. అందుకే ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 12 … Read more

అడిగినన్ని లడ్డూలు ఇవ్వడం టీటీడీకి సధ్యమేనా?

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా చలా ఫేమస్. ఇటీవల నాసిరకం నెయ్యి, ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారు అనే వివాదం రేగిన విషయం తెలిసిందే. ఎంతో ప్రీతిపాత్రమైన ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తాము స్వీకరించడమే కాకుండా ఇరుగుపొరుగు వారికి కూడా పంచడం ఆనవాయితీ.  అందుకే తిరుమల వెళ్లినప్పుడు అవసరమైన సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. కానీ టీటీడీ పరిమితి కారణంగా నిరాశే ఎదురవుతోంది. అయితే మున్ముందు భక్తులు అడిగినన్ని లడ్డూలు విక్రయించేందుకు … Read more

TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడో తెలుసా..

హిందు విశ్వాసాలలో వైకుంఠ ఏకాదశికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ రోజు భక్తులకు ఒక ప్రత్యేకమైన రోజు. వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న తరుణంలో తిరుమలకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో … Read more

sabarimala: కిటకిటలాడుతున్న శబరిమల

కార్తీకం రాగానే శబరిమల అయ్యప్ప భక్తులతో సందడి నెలకొంటుంది. మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమిస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్ ఆరంభం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల తాకిడి రెట్టింపైంది.   ఆలయం నవంబర్ 16న తెరుచుకోగా 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ వివరాలను ఆదివారం దేవస్థానం (ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు) అధ్యక్షుడు … Read more

TTD: శ్రీ‌వారి ఆర్జితసేవ టికెట్ల కోటా విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇందులో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి సేవలు ఉన్నాయి. వర్చువల్ సేవా టికెట్లుఫిబ్రవరి నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు మరియు దర్శన స్లాట్‌ల కోటాను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణం టోకెన్లుఅంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఫిబ్రవరి … Read more

Ramcharan: దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శింకున్చనారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన భార్య ఉపాసన స్పందించారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఉపాసన.. ‘‘విశ్వాసం ఒక్కటి చేస్తుంది.. అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు’’  అని పేర్కొన్నారు.   ఉపాసన పోస్టుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. … Read more

సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనం సులభతరం కానుందా ?

రెండు-మూడు గంటల్లో తిరుమల దర్శనం ఎలా? – మళ్లీ ఆ విధానం తీసుకురానున్నారా! టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు అండ్ టీమ్ తిరుమలేశుని సామాన్యులకు మరింత చేరువ చేయడానికి సంకల్పం చేసున్నట్లు కనిపిస్తోంది. నాయుడు మాత్రం ఈ విషయములో కృత నిశ్చయంతో ఉన్నారు . కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఇందు కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 10 వేల … Read more

తెలంగాణ -టు- అరుణాచలం

కార్తీక మాసంలో అరుణాచలేస్వరుడి దర్సనం కోసం తహతహలాడే వారి కోసం తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలం వరకు స్పెషల్ బస్సులు నడపడానికి సన్నాహాలు చేసారు . హైదరాబాద్ లో ఈ నెల 13 న బస్సులు బయలుదేరతాయ్. హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్సులను అరుణాచలానికి నడుపుతున్నారు .  13న బయలుదేరే భక్తులకు 14, 15 తేదీలలో అరుణాచలం శివుడి దర్శనం ,  … Read more

Temple Economics: గుడి చుట్టూ..,

గుడికి వెళ్లి . . దేవుడిని దర్శించుకోవాలి .. అనే ఒక చర్య . .. ఆర్ధిక వ్యవస్థలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ . . ఎంతోమందికి ఉపాధి బాటను చూపుతోంది . హిందూ ఆచార, సంప్రదాయాల వెనుక ఉన్న కోణాలను నిశితంగా పరిశీలిస్తే  ఉన్నవన్నీ పరమార్ధాలే. ఉపాధి మార్గాలే .  ”ఆలయాల నిర్మాణం చేసినప్పుడు అప్పటి పాలకులు (రాజులు )  గుడిలో దేవుడికి సేవలు చేసేందుకు చాకలి ,  మంగలి ,  కుమ్మరి ,  … Read more

VHP: జనవరి 5న హైందవ శంఖారావం.. వీహెచ్‌పీ బహిరంగ సభ

దేవాలయ వ్యవస్థ ప్రమాదంలో పడింది.. భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు విలువలేకుండా పోయింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి..అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల మనోభావాలు, సమస్యలను అర్థం  చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం … Read more