USA: మీటింగ్ కి డుమ్మా . . 99 మంది ఉద్యోగుల్ని తొలగించిన అమెరికా కంపెనీ..

కంపెనీ ఏర్పాటు చేసే మీటింగ్ కి డుమ్మా కొడితే . . మన దేశంలో అయితే మహా అయితే వార్ని0గ్ ఇస్తారు. ఇంకా సీరియస్ గా ఉండే బాసులైతే ఇంక్రిమెంట్ కట్ చేస్తామనో, బెనిఫిట్స్ కటింగ్ అనో చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉంటాయి . అమెరికాలో ఓ కంపెనీ సిఈవో మాత్రం ఏకంగా ఒకేసారి 99 మంది ఉద్యోగులను సమావేశానికి హాజరుకాలేదన్న ఒకే ఒక కారణంతో తొలగించడం హాట్ టాపిక్ . మార్నింగ్ సమావేశానికి హాజరు కాలేదని … Read more

అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇది వరకే తన విధానాన్ని సుస్పష్టం చేసారు . ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు యూఎస్ లో కసరత్తు మొదలైంది. దీని కోసం ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌; భారత సంతతికి చెందిన బయోటెక్‌ కంపెనీ సీఈవో, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు వివేక్‌ రామస్వామి ఉమ్మడి ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం  ప్రత్యేకంగా ఏర్పాటు … Read more

మిస్ యూనివర్శ్‌గా డెన్మార్క్ యువతి..

విక్టోరియాని వరించిన అందాల కిరీటం డెన్మార్క్ అందాల పోటీలలో చరిత్ర సృష్టించింది. 73వ మిస్ యూనివర్శ్ 2024 పేజెంట్‌లో ఆ దేశానికి చెందిన 21 ఏళ్ల విక్టోరియా జాయిర్ (Victoria Kjaer)ని అందాల కిరీటం వరించింది. ఇప్పటివరకూ డెన్మార్క్‌కి ఇలాంటి కిరీటం దక్కడం మొదటిసారి . ఈ పోటీలలో మెక్సికోకి చెందిన మర్లా ఫెర్నాండా బెల్ట్రాన్ (Marla Fernanda Beltran) మొదటి రన్నరప్‌గా నిలవగా.. నైజీరియాకి చెందిన స్నిడిమ్మా అడెత్‌షిన్హా (Cnidimma Adetshina) రెండో రన్నరప్ పొజిషన్‌లో … Read more

China: చైనాలో ఎనిమిది మందిని కత్తితో పొడిచిన విద్యార్థి

చైనాలో ఓ యువకుడు శనివారం ఉన్మాదిగా ప్రవర్తించి ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. మరో 17 మందిని గాయపర్చాడు. ఈ ఘటన చైనా తూర్పు నగరం వుషీలో జరిగింది. 21 సంవత్సరాల యువకుడు కళాశాల క్యాంపస్‌లో కత్తితో వీరంగం సృష్టించాడు. విచక్షణారహితంగా కత్తితో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో  8 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వుషీ  వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ … Read more

ఎలాన్ మస్క్‌కు కీలక పదవి

తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో విశేష కృషి చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఖాయమైంది. అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ‘‘అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. ‘సేవ్ … Read more

Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి

కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడులు చేశారు. ఈ ఘటనపై కెనడాలోని భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.  హిందూ దేవాలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడిని ఖండిస్తున్నామని భారత విదేశాంగశాఖ అధికారి ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ అన్నారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి దాడుల నుంచి దేవాలయాలను కాపాడాలని ఆయన కెనడా ప్రభుత్వాన్ని కోరారు. హింసకు పాల్పడిన వారిని తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు. … Read more

Canada: కెనడా పార్లమెంట్ బయట ‘ఓం’ జెండా ఎగురవేసిన భారత సంతతి

హిందు కెనడీయన్లు రాజకీయాల్లో పాల్గొనాలి అంటూ కెనడా ఎంపీ చంద్ర ఆర్య పిలుపునిచ్చారు.  అక్కడి పార్లమెంట్ వెలుపల ‘ఓం’ గుర్తు కలిగిన కాషాయ జెండాను ఎగురవేశారు. నవంబర్  లో హిందూ హెరిటేజ్ మాసాన్ని పురస్కరించుకొని ఆయన  మాట్లాడారు. కెనడా రాజకీయ రంగంలో మన ప్రాతినిధ్యం చెప్పుకోదగినంతగా లేదన్నారు. 2022 నుండి హిందూ వారసత్వ మాసంలో చంద్ర ఆర్య హిందూ జెండాను ఎగురవేయడం ఇది మూడోసారి. కెనడాలో హిందూ వారసత్వ మాసాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. హిందూ మతానికి … Read more

భారత్, చైనా సైనికులు.. దీపావళి రోజు ఏంచేశారు ?

సరైన కారణం లేకుండానే అస్తమానూ కయ్యానికి కాలు దువ్వే మన పొరుగుదేశం చైనా . . సరిహద్దు ప్రాంతంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది .  దీపావళి పర్వదినాన ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకోవడం విశేషం .   దీపావళి సందర్భంగా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు సరిహద్దు పాయింట్ల వద్ద భారత, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్న అరుదైన ఘటన జరిగింది .  . తూర్పు లద్దాఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ … Read more

Spain Floods: స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు.. పలువురి మృతి.. వందలాదిమంది గల్లంతు

ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు అధికమవడం చూస్తున్నాం.  ఇటీవల భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. స్పెయిన్‌లోని వాలెన్సియాలో సంభవించిన ఆకస్మిక వరదలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. మరెంతోమంది గల్లంతయ్యారు. వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. గల్లంతయిన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. వాలెన్సియాలో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ … Read more

Washington: వాషింగ్టన్ పోస్ట్‌ పత్రికకు షాక్.. 2 ల‌క్ష‌ల‌కు పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ప్రముఖ వార్తా పత్రిక  వాషింగ్టన్ పోస్ట్ కు భారీ షాక్ ఇచ్చారు ఆ దేశ ప్రజలు. అమెరికా నుంచి వెలువడే ప్ర‌ముఖ‌ వార్తాపత్రిక వాషింగ్టన్. అయితే అమెరికా అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ ఆమోదాన్ని నిరోధించాలని ఆ పత్రిక నిర్ణయం తీసుకుంది. అంతే ఈ నిర్ణయం వెలువరించిన వెంటే సోమవారం మధ్యాహ్నం నాటికి 2లక్షలకు పైగా ప్రజలు తమ డిజిటల్ సభ్యత్వాలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని  అక్కడి నేషనల్ పబ్లిక్ రేడియో … Read more