Supreme Serious: దేవుడిని రాజకీయాలలోకి లాగొద్దు : లడ్డు కల్తీ విచారణపై సుప్రీం ధర్మాసనం

”దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి .  పాలిటిక్స్ లోకి లాగొద్దు . .” అంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది .  తిరుమల శ్రీవారి లడ్డూ  తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్బంగా ధర్మాసనం  హితవు పలికింది. ”లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి మీ వద్ద  ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్  బాలకృష్ణన్ ధర్మాసనం సూటిగా  ప్రశ్నించింది.

కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.

కల్తీ గురించి ఎలా తెలిసింది ” స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని  వాడినట్లు  ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్ట్ సందేహం వ్యక్తం చేసింది. స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్ రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ బాలకృష్ణన్ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.

కేంద్రం విచారణ చేయాలి . .నెయ్యి కల్తీ జరిగిందని సీఎం ఎలా చెప్పగలిగారు >  అని కూడా న్యాయస్థానం ప్రశ్నించినట్లు తెలిసింది .  సీఎం స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత ‘సిట్ ‘  సక్రమంగా విచారణ చేయగలదా … అని ప్రశించింది .  లడ్డు కల్తీపై కేంద్రం విచారణ చేస్తే బాగుటుంది అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.