Pawan Kalyan: నేడు తిరుపతిలో పవన్ వారాహి సభ

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల చేరుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తిరుపతి జ్యోతిరావ్ పూలే సర్కిల్ సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లలో మునిగి పోయారు. ఈ సభలో పవన్  వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు.

పవన్ ప్రకటించే డిక్లరేషన్ లో ఏయే అంశాలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ కల్యాణ్ ఏమి సందేశం ఇస్తారు అనేదానిపై అందరిలోనూ ఆసక్తిరేపుతోంది.  ఈ  బహిరంగ సభకు రెండు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో జనసేన, కూటమి శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు.  పవన్ కల్యాణ్ మూడు రోజులుగా తిరుపతిలోనే ఉన్నారు.