ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు . అయినా విధి నిర్వహణలో విరామం లేకుండా శ్రమిస్తున్నారు . 102 డిగ్రీల జ్వరం వచ్చినా . . పవన్ విశ్రాంతి లేకుండా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు . వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. క్లోరినేషన్ చేపట్టేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
సహాయక చర్యలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. పలు కాలనీల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సహాయక చర్యలు శరవేగంగా చేపట్టేలా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వైరల్ ఫీవర్తో బాధపడుతునే బాధితుల యోగాక్షేమాలు తెలుసుకుంటున్నారు . ఏలేరు వరదపైనా పవన్ ఆరా తీశారు . ముందస్తు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ , పంచాయత్ రాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారే చేసారు .