Mercedes Benz: మార్కెట్లోకి మెర్సిడెస్‌ బెంజ్‌ మేబాక్‌ ఈక్యూఎస్‌ 680

Mercedes Benz: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ తొలి పూర్తి విద్యుత్‌ కారు ”మేబాక్‌ ఈక్యూఎస్‌ 680” ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చింది. దీని ఎక్స్‌షోరూ మ్‌ ధర రూ.2.25 కోట్ల నుంచి ప్రారంభమవుతుం ది. అల్ర్టా లగ్జరీ విభాగంలో డిజిటల్‌, ఎలక్ర్టిక్‌ కార్ల సెగ్మెంట్‌లో అగ్రస్థానం సాధించాలన్న తమ ఆశయానికి ఇది బలం చేకూరుస్తుందని మెర్సిడె్‌స-బెంజ్‌ ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. మేబాక్‌ అమ్మకాలపరంగా ప్రస్తుతం తాము ప్రపంచంలోని టాప్‌ 10 మార్కెట్లలో ఒకటిగా చేరామని, టాప్‌ 5 మార్కెట్లలోకి చేరడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు   ఆయన తెలిపారు .