Is YCP necessary? వైసీపీ వాళ్ళు అవసరమా? చేరికలపై టీడీపీ కేడర్ ఆగ్రహం

  • ”మంత్రి నారాయణ చెప్పాడని నెల్లూరులోను . , మరో ఎంపీ రికమండ్ చేసాడని ఏలూరులోని . . ఇలా వైసీపీలో సెటిల్ మెంట్ బ్యాచ్ లను టీడీపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు . ”

”ఐదేళ్లూ మన వాళ్ళని వేధించారు .  వైసీపీ ఎమ్మెల్యేలే కాదు . . గ్రామ, మండల  స్థాయి నాయకులూ ఎక్కడికక్కడ టీడీపీ ,  జనసేన పార్టీలలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను అనేక రకాలుగా వేధించి . . ఇబ్బందులు పెట్టారు .  ఎన్నికల ముందు వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి . . జైళ్లలో పెట్టారు .  ఆ సమయంలో టీడీపీ నియోజక ,  జిల్లా ,  రాష్ట్ర స్థాయి నాయకులు సైతం మాకు సపోర్ట్ గా లేరు .  పార్టీపై ఉన్న అభిమానంతో తెగించి వైసీపీ కేడర్ కి ఎదురు నిలబడ్డాం . . ఇపుడు వాళ్ళని టీడీపీ లో చేర్చుకుని మాపై ఎక్కిస్తారా ‘ ‘ ఇదీ టీడీపీ కేడర్ అధిష్టానాన్ని ,  పార్టీ అధినేత చంద్రబాబును నిలదీస్తున్న వైనం .

గత వారంలో ఏలూరు, నిన్న నెల్లూరు నగరాల పరిధిలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు .  అలాగే వీరితో పాటు . . కొన్ని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ,  చోటా ,  మోటా నేతల వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు .  కొన్ని చోట్ల టీడీపీలో చేరేందుకు వైసీపీ లీడర్లకు అభ్యన్తరాలు వస్తున్నాయ్ .  అలాంటి చోట్ల నియోజన వర్గ నేతలు ,  ఎమ్మెల్యేలు అనుచరులు ,  బంధువులు డబ్బు తీసుకుని వైసీపీ నేతలకు టీడీపీలో చేరికలు లైన్ క్లియర్ చేస్తున్నట్లు టీడీపీ కేడర్ నుంచే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి .  ఈ పరిస్థితి రాయలసీమ ,  పల్నాడు ,  కోస్తా  ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తోంది .

2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ . . ముక్యంగా రాయలసీమ ,  పల్నాడు ప్రాంతాలలో టీడీపీ యాక్టివ్ కార్యకర్తలను వైసీపీ నేతలు హింసించారు .  ఆస్తులు ద్వంసం చేసారు .  భూములు కబ్జా చేసారు .  పండ్ల తోటలు నరికేసిన సంఘటనాలు సైతం రాయలసీమలో అనేక చోట్ల ఎదురయ్యాయి .  టీడీపీ నుంచి చాలా చోట్ల న్యాయ సహాయం కూడా అందలేదు .  అయినా ఐదేళ్లు లక్షల మంది టీడీపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడి చివరకు వైసీపీని ఇంటికి పంపించారు .

అధికారంలోకి వచ్చాక టీడీపీ అధిష్టానం ,  ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న నిర్వాకం ఇదీ . . అంటూ కేడర్ తీవ్ర ఆగ్రహంగా ఉంది .  వైసీపీ నుంచి టీడీపీకి రావడానికి గ్రావెల్ ,  మట్టి ,  భూదందాలు.. చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఎక్కువమంది పార్టీ మారడానికి కారణం . . అంటూ టీడీపీ కేడర్ బలంగా ఆరోపిస్తుంది .  అయినా అధిష్టానం పట్టించుకోవడంలేదు .  ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజులలో టీడీపీ కేడర్ ప్రత్యామ్నాయం చూసుకునేందుకు ఆలోచించరు. చంద్రబాబు ఈ విషయాన్నీ గమనించి తగిన నిర్ణయం తీసుకుంటే పార్టీకి ,  రాష్ట్రానికి మంచిదని ఆ పార్టీ పెద్దలే బాహాటంగా చెపుతున్నారు.