vijayawada floods: వరదల్లో దెబ్బతిన్న వేల కార్లు . ..

వరదల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న విజయవాడ వాసుల కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి .  వరదల్లో అతలాకుతలమైన ప్రజలకు స్వచ్చంద సంస్థలు ,  గవర్నమెంట్ మెరుగైన సేవలు అందించారు .

బుడమేరు పొంగి వరదలు భారీగా రావడంతో వాహనాలు ఈ  వారం రోజులపాటు వరద  నీటిలోనే ఉండిపోయాయి. వందల  వాహనాలు  వరద ధాటికి ఇంటి నుంచి దూరంగా కొట్టికుపోయాయి. ఇంకొన్ని కార్లు తల్లకిందులుగా పడిపోయి అలానే నీటిలో ఉండిపోయాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుండడంతో కార్ల యజమానులు వాటిని స్టార్ చేసేందుకు ప్రయత్నించగా.. అవి మోరాయిస్తున్నాయి. అయితే స్టార్ కాకపోవడంతో వాటిని రిపేర్ చేయించేందుకు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కారు మరమ్మతుకు  రూ.60వేలు గరిష్ఠంగా రూ.లక్ష వరకూ ఖర్చవుతుందని షోరూమ్ యజమానులు చెప్పడంతో నోరెళ్ల బెడుతున్నారు. ఇప్పుడిప్పుడే వరదలు తగ్గి కుదుటపడ్డామని అనుకుంటున్న సమయంలో మరో దెబ్బ తగిలిందని వరద బాధితులు వాపోతున్నారు.విజయవాడ వరద ప్రభావ ప్రాంతాల్లో వరదనీరు తగ్గి వాహనాలు బయటపడుతున్నాయి. ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న వాహనాలు దర్శనమిస్తున్నాయి. వరద ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో వాహనదారులు వాటిని తీసుకుని షోరూమ్‌లకు వెళ్తున్నారు. అతి కష్టం మీద కార్లను ట్రక్‌లపై గొలుసులతో కట్టి మరీ తరలిస్తున్నారు. అయితే అక్కడ వారు చెప్పే మాటలు విని యజమానులు నోరెళ్లబెడుతున్నారు. మరమ్మతులకు లక్షల్లో ఖర్చవుతుందని, రూ.12లక్షల నుంచి రూ.కోటి వరకూ విలువ చేసే కార్లకు కనీసం రీసేల్ ధర కూడా రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.