Cabinet Meeting : ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ఏపీలోని అమరావతిలో మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనుంది.

అదేవిధంగా రివర్స్ టెండర్ల విధానం (Reverse Tenders Procedure) పై ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ప్రభుత్వ పథకాల అమలు (Government Schemes )పై ప్రత్యేక దృష్టిపెట్టిన మంత్రివర్గం సాగునీటి సంఘాలకు నిర్వహించాల్సిన ఎన్నికల(Elections) పై కూడా చర్చించనుంది. ఈ నేపథ్యంలో అజెండా నుంచి కేబినెట్ నోట్స్ వరకు ఆన్ లైన్ ద్వారానే ఏపీ ప్రభుత్వం మంత్రులకు అందజేయనుంది.

మరోవైపు ఎక్సైజ్ అవినీతికి స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (Special Ebnforcement) అని కూటమి ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెబ్ ను రద్దు చేసి, ఎక్సైజ్ శాఖ (Exice Department) లో విలీనం చేయాలని సర్కార్ యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం (Key Decision) తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.