ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఉవ్వెత్తున ఎగిసిపడిన అమరావతి భూముల ధరలు అప్పటి నుంచీ ఎందుకు స్తబ్ద0గా ఉండిపోయాయి . కూటమి పాలన మొదలై వంద రోజులు దాటినా క్యాపిటల్ సిటీ అమరావతిలో స్థలాల కొనుగోళ్లు ఎందుకు మందగించాయి . .
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం 15 వేల కోట్లు నిధులు మంజూరుచేసినా , పలు జాతీయ , అంతర్జాతీయ కంపెనీలు అమరావతి ఏరియాలో పెట్టుబడులకు రెడీ అవుతున్నా . . అనుకుంత స్థాయిలో అమరావతిలో భూములు కొనేందుకు ఒత్సాహికులు ఇంకా జంకుతున్నారు . 2014-2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది . ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా అమరావతిని సమర్ధించారు . తర్వాత అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేసారు . 2024లో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చినా . . జగన్ కుట్ర పూరిత ఆలోచనలపై పెట్టుబడుదారులలో భయాలు ఇంకా తొలగిపోలేదు . 2029 లో మళ్ళీ రాజకీయం ఎలా ఉంటుందొ అన్న అనుమానాలతో ఉన్న వారు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు . అమరావతిలో రేట్లు పెరగకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెపుతున్నారు . ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున రాజధాని ప్రధాన ప్రాంతాలలో గజం . . 40-50 వేల వరకు ధర పలికింది . ఇప్పటికీ అవే ధరలు కొనసాగుతున్నాయి . SRM యూనివర్సిటీ ఎదురుగా గజం 70 వేలు పలికెది . మూడు నెలలలో అది 65 వేలకు తగ్గిందని చెపుతున్నారు . ముందే రేట్లు పెంచడం వల్ల ఇపుడు కొనేందుకు ఎవరు ముందుకు రావడంలేదని చెపుతున్నారు . అయితే రాజధాని ప్రాంతంలో ఇపుడున్న రేట్లు పెద్ద రేట్లు కాదని పలువురు చెపుతున్నారు .
”కూటమి అధికారంలోకి వస్తే . . అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేద్దామనుకున్నాం . . కానీ జగన్ ని చూసి భయమేస్తోంది . అతను ప్రతిపక్షంలో ఉన్నా . . ఎపుడు ఏమి చేస్తాడో తెలియడంలేదు . చంద్రబాబు , పవన్ కళ్యాణ్ మెతక వైఖరి వల్ల జగన్ అండ్ బ్యాచ్ ని కట్టడి చేయలేకపోతున్నారు . ..” అని ఓ బిజినెస్ పర్సన్ అభిప్రాయపడ్డారు .
“ఐదేళ్ల పాలనలో అమరావతిని మట్టుపెట్టిన జగన్ మోహన్ రెడ్డి… అమరావతిపై తన కక్షను ఇంకా వీడినట్లు కనిపించడంలేదు . తన సోషల్ మీడియా ద్వారా అమరావతిపై ఇంకా విషము చిమ్ముతూనే ఉన్నాడు . వైసీపీ కుట్రలకు పెట్టుబడిదారులు ఇంకా భయపడుతూనే ఉన్నారు . …” అంటూ ఇటీవల హైదరాబాద్ కి చెందిన విశ్లేషకులు చేస్తున్న హెచ్చరికలు అమరావతిలో లావాదేవీలపై నీలినీడలు అలుముకునేందుకు కారణంగా కనిపిస్తోంది .