Retirement : క్రికెట్‎కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్.. !!

ప్రముఖ భారతీయ క్రికెట్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ప్రొపెషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటిస్తూ సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలియజేశాడు.

ఆగస్ట్ 24వ తేదీ ఉదయం శిఖర్ ధావన్ తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ ఆటకు వీడ్కోలు పలికారు. దేశం (India) కోసం ఆడటం ద్వారా తన కల నిజమైందన్న ధావన్ ఇప్పుడు ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తనకు మద్ధతుగా నిలిచిన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా క్రికెట్ అన్ని ఫార్మాట్లలో శిఖర్ ధావన్ అనుభవజ్ఞుడని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా టీమ్ ఇండియా(Team India) కు అత్యంత ఉత్తమ ఓపెనర్లలో ఒకరిగా నిలిచారు . కాగా 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (Bharat Champions Trophy) గెలిచిన జట్టులో ధావన్ కీరోల్ పోషించారు. అంతేకాదు ఈ టోర్నీలోని ఐదు మ్యాచుల్లో ఏకంగా 90.75 సగటుతో 363 పరుగులు చేశారు.

టీమిండియాకు శిఖర్ ధావన్ 2010 నుంచి 2022 వరకు సుమారు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) లో పది వేలకు పైగా పరుగులు తీశారు. అలాగే 24 శతకాలు బాదాడు. వీటిలో వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు ఉన్నాయి.