రేవంత్ ఏసీబీ కేసు కక్షతోనే నాపై కేసు.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ .

‘గతంలో రూ 50 లక్షల నగదుతో పట్టుబడిన రేవంత్ రెడ్డి . . కక్ష కట్టి నాపై ‘ఫార్ములా  ఈ – రేసు’ కేసును పెట్టారు .  ఇది తప్పుడు కేసు .  నేను ఎలాంటి తప్పుచేయలేదు .  కాబట్టే ధైర్యంగా ఉన్నాను . ‘అని తెలంగాణ మాజీ మంత్రి ,  BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు .

ఫార్ములా ఇ రేస్ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన పాత్రపై ఏడున్నర గంటల పాటు విచారణ జరిపిన తర్వాత కెటిఆర్ హైదరాబాద్‌లోని ఇడి కార్యాలయం   బయట మీడియాతో మాట్లాడారు .   ఈ సందర్బంగా రేవంత్ రెడ్డిని లై డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్  సవాలు విసిరారు .    “నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. అతను కూడా లై డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలి. న్యాయమూర్తి ముందు హాజరు కావాలి. అప్పుడే  నిజం బయటకు వస్తుంది” అని  కేటి రామారావు అభిప్రాయపడ్డారు .    ఈ ఒప్పందంలో అవినీతి జరగలేదు. సగం పైసా కూడా అవినీతి జరగలేదు. “దేశంలో న్యాయం జరిగే వ్యవస్థను నేను నమ్ముతాను. దర్యాప్తు సంస్థలతో సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను క్లీన్ కాబట్టి దర్యాప్తు సంస్థల విచారణకు ఎన్నిసార్లు అయినా హాజరవుతాను. నోటుకు ఓటు కేసులో రూ. 50 లక్షల నగదుతో పట్టుబడిన తర్వాత రేవంత్ రెడ్డి ఎసిబి మరియు ఇడి కేసులను ఎదుర్కొంటున్నందున ఈ కేసును నాపై మోపారు” అని ఆయన అన్నారు.