ఐశ్వర్యారాయ్ అప్పటి ప్రపంచ సుందరి. తర్వాత తన చందాలతో, అద్బుత నటనతో ఎందరినో ఆకట్టుకుని బాలీవుడ్ లో అగ్రస్థాయి హీరోయిన్య గా నిలిచింది. అందాల నటిగా పేరే ప్రతిష్టలు సంపాదించింది. అమితాబ్ కుమారుడైన అభిషేక్ బచ్ఛన్ ను పెళ్లి చేసుకుంది. ఆ దంపతులకు ఒక పాపకూడా ఉంది. ఈ క్రమంలో ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని చాలా కాలంగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ నిజమా? కాదా? అనేది ఎవరికీ అర్ధం కావడంలేదు. ఆ రూమర్లు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. వాటిని వారు ఎవరూ ఖండించలేదు.. ఎక్కడా కూడా ఈ రూమర్స్ పై మాట్లాడలేదు.
ఇటీవల ఈ జంట ఎవరికి వారుగా ఫంక్షన్లకు హాజరు కావడం, ఒంటరిగానే ప్రయాణాలు చేస్తూ కనిపించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఈ రూమర్స్ ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదని, మనం ఏం మాట్లాడినా దానికి కుత్సిత మెదడుతో తమకు కావాల్సిన అర్థం తీస్తారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఇతరులలో లేని లోపాలను వెతుకుతుంటారని చాలా ఘాటుగానే స్పందించారు.
మెదడులేని ఇలాంటి వ్యక్తుల రాతల వెనక వారి అజ్ఞానం, తెలివితక్కువతనం కనిపిస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని దురదృష్టాలను దాచి, ఇతరుల మాటల్లో ప్రతీ పదానికీ పెడార్థం తీస్తారంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. ఇటీవల అభిషేక్ బచ్చన్ ఓ ట్వీట్ చేస్తూ సుదీర్ఘ కాలం దాంపత్య జీవనం గడిపిన వారు కూడా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ ఓ సామాజిక సమస్యపై చర్చ కోసం చేసిన ఈ ట్వీట్ ను ఆయన సొంత జీవితానికి ఆపాదించి అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అమితాబ్ పరోక్షంగా చెప్పారు.
దీంతో ఈ రూమర్స్ కు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి మరి.