దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు (Bomb Threats) సర్వ సాధారణంగా మారాయి. రైల్వే స్టేషన్, విమానాలు, పాఠశాలకు కొందరు గుర్తు తెలియని దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు చెందిన విమానాని( Flight) కి బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఢిల్లీ నుంచి విశాఖ (Delhi to Vishaka) కు బయలుదేరిన కాసేపటికే విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ పోర్టు (Airport) కు ఓ ఆగంతకుడు కాల్ చేసి చెప్పాడు. వెంటనే ఢిల్లీ అధికారులు (Delhi Officials) విశాఖ విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో విమానం విశాఖలో ల్యాండ్ కాగానే ప్రయాణికులను దింపేసిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు (Explosives) దొరకలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు (Case Register) చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.