Srisailam Reservoir : నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గడంతో దానికి సంబంధించిన గేట్లను సోమవారం అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. గేట్లను మూసివేయడంతో స్థానిక మత్స్యకారులు(Fishermens)జలాశయం వద్దకు చేపల వేటకు వెళ్లారు. చిన్న చిన్న పడవలపై మత్స్యకారులు వేటకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. చేపల వేట కోసం వందల సంఖ్యలో మత్స్యకారులు వెళ్తున్న దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు వీరంతా అధికారుల( Officials) హెచ్చరికలను పట్టించుకోకుండా వేటకు వెళ్లడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
