ఆర్థిక ఇబ్బందుల్లో స్పైస్ జెట్.. క్రూ సిబ్బందికి వేతనం లేని సెలవు

దేశీయ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్ (Spicejet) ఆర్థిక సమస్యల(Financial problems) తో సతమతం అవుతోంది. ఈ మేరకు స్పైస్ జెట్ యాజమాన్యం కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది.

మూడు నెలల పాటు 150 మంది క్రూ సిబ్బంది(Crew staff) కి వేతనం లేని సెలవును ఇచ్చింది. దాంతో పాటుగా విమాన సర్వీసుల నిర్వహణను సైతం తగ్గించింది. ప్రస్తుత విమాన సర్వీసులకు గిరాకీ తగ్గడం, సంస్థ దీర్ఘకాలిక సుస్థిరత్వం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పైస్ జెట్ యాజమాన్యం తెలిపింది. సెలవు ప్రకటించిన సిబ్బంది స్పైస్ జెట్ ఉద్యోగులుగా కొనసాగతారన్న యాజమాన్యం వారి హెల్త్ బెనిఫిట్లు (Health Benefits), ఎర్న్డ్ లీవ్స్ (Earned leaves)యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.