Raksha Bandhan 2024: సాధారణంగా ఆగస్ట్ (August) నెల వచ్చిందంటే చాలు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అంతా రాఖీ పండుగ కోసం వేచి చూస్తుంటారు. కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగ. రక్త సంబంధమే( Blood Relation) లేకున్నా అక్కాతమ్ముళ్లుగా భావించి సోదరీమణులు రాఖీ (Rakhi) ని కడుతుంటారన్న సంగతి తెలిసిందే. అమ్మ చూపించే ప్రేమ, నాన్న చూపించే భద్రత కలిపి ప్రతిబింబించే రూపమే అన్న అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రాకా అంటే నిండు పున్నమి అని అర్థం. పున్నమి రోజు ధరించే రక్షను రాఖీ అని పిలుస్తుంటారు. అంతేకాదు రక్షాబంధనంలో ఉండే మూడు పోగుల దారం.. ఆయువు, ఆరోగ్యం మరియు సంపదకు సంకేతమని పెద్దలు చెబుతుంటారు. సోదర సోదరీమణుల బంధాన్ని గుర్తు చేసే రక్షాబంధన్ రోజున తమ ప్రేమకు చిహ్నంగా అక్కలు, చెల్లెల్లు (Sisters) తమ సోదరులకు రాఖీ కడతారు. అయితే రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మీ కోసం రాఖీ పండుగ శుభాకాంక్షలు..
* మంచి చెడుల్లో తోడుగా ఉన్నందుకు థ్యాంక్యూ. హ్యాపీ రక్షాబంధన్
* రక్తసంబంధమే లేకున్నా.. అంతకంటే ఎక్కువ ప్రేమానురాగాలను పంచిన సోదరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు
* మంచి మనసు, చిరునవ్వుకు చిరునామాగా నిలిచే అన్నయ్య.. నీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు
* నిస్వార్థమైన ప్రేమను పంచిన సోదరులు, సోదరీమణులు అందరికీ రాఖీ శుభాకాంక్షలు.