స్పెయిన్ (Spain) లో ఆలివ్ ఆయిల్ (Olive Oil) అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. యావత్ ప్రపంచంలోనే సుమారు 40 శాతం సరఫరా చేసే స్పెయిన్ లో ప్రస్తుతం వంటనూనెగా ఆలివ్ నూనె తొలగించబడింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆలివ్ నూనె ఉత్పత్తిదారుల (Olive Oil Procucers) కు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ధరలేనని తెలుస్తోంది. ఆలివ్ నూనె ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు సన్ ఫ్లవర్ ఆయిల్ (Sunflower Oil) పై దృష్టి సారించారని సమాచారం.
స్పానిష్ నివాసాల్లో ఆలివ్ నూనె ఇప్పటివరకు అత్యంత ప్రజాదరణ పొందిన వంట నూనె (Cooking Oil) గా ఉందని అక్కడి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ( Ministry of Agriculture) తెలిపింది. 2023 సంవత్సరం వాల్యూమ్ లో సుమారు 62 శాతం అమ్మకాలను కలిగి ఉండగా.. సన్ ఫ్లవర్ ఆయిల్ 34 శాతం అమ్మకాలు జరిగాయి. ఆ తరువాత ఆలివ్ ఆయిల్ అమ్మకాలు 18 శాతానికి పడిపోగా.. సన్ ఫ్లవర్ ఆయిల్ అమ్మకాలు 25 శాతం పెరిగాయి. అయితే ప్రస్తుతం స్పెయిన్ లో ఆలివ్ నూనె వినియోగం తగ్గుతుందని తెలుస్తోంది. దీంతో స్పెయిన్ లోని అతిపెద్ద సూపర్ మార్కెట్ (Largest Supermarket) అయిన చైన్ మెర్కాడోనా (Chain Mercadona) ఈ ఏడాది ఆలివ్ నూనె ధరలను 25శాతం వరకు తగ్గించిందని సమాచారం.