MP Vasant Chavan: నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (Nanded MP Vasant Chavan) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్య (Kidney problem) తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital) లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

వసంత్ చవాన్ ( Vasant Chavan) అంత్యక్రియలను స్వగ్రామం నైగావ్ లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నైగావ్ (Naigav Village) లో వసంత్ చవాన్ జన్మించారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2002లో ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు. 2009- 2014 వరకు నైగావ్ ఎమ్మెల్యే (Naigav MLA) గా పని చేశారు. 2021-23 వరకు నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ (Central Co-Operative Bank Chairman) గా పని చేశారు. కాగా ప్రస్తుతం ఆయన నాందేడ్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.