The Lion King Trailer :‘‘ముఫాసా’’ ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదల

Mufasa: ఆస్కార్ విజేత బారీ జెంకిన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘ ముఫాసా’ ది లయన్ కింగ్ ట్రైలర్ అధికారికంగా విడుదలైంది. ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జేఫ్ నాథన్సన్ రచనలో వచ్చిన ఈ చిత్రం 2019లో వచ్చిన లయన్ కింగ్ కు ప్రీక్వెల్. ట్రైలర్ లోని అద్భుతమైన దృశ్యాలు సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.