Olympic mens marathon : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భాగంగా జరిగిన పురుషుల మారథాన్ లో ఇథియోపియోకు చెందిన తమిరత్ తోలా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. రెండు గంటల 06 నిమిషాల 26 సెకన్లలో తోలా ఒలింపిక్ రికార్డు సాధించాడు.
బెల్జియంకు చెందిన అథ్లెట్ బషీర్ అబ్ధి రజతం సాధించగా, కెన్యాకు చెందిన బెన్సన్ కిప్రుటో కాంస్య పతకం సాధించాడు. 2016లో జరిగిన రియో గేమ్స్ లో 10,000 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచిన తోలా రెండు వారాల ముందే ఈ మారథాన్ లోకి ప్రవేశించాడు.