Harghar Tiranga: స్వాతంత్య్ర దినోత్సవం.. హర్ ఘర్ తిరంగా సర్టిఫికేట్ ఇలా పొందండి

Harghar Tiranga Certificate Download : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది.

ఇప్పటికే ఈ ప్రచారాన్ని ఘనంగా నిర్వహించాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలోని పౌరులంతా జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి ఆ ఫోటోను హర్ తిరంగా.కామ్ వెబ్ సైట్ లో పోస్ట్ చేయాలని కోరారు. మోదీ 2022లో ప్రారంభించిన ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమం ఇప్పుడు మూడో సంవత్సరం కొనసాగుతోంది. అలాగే ఈ సంవత్సరం 13వ తేదీన పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రత్యేక తిరంగా బైక్ ర్యాలీని కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ భారత్ మండపం ప్రగతి మైదాన్ వద్ద ప్రారంభమై.. ఇండియా గేట్ మీదుగా మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వద్ద ముగుస్తుంది.

అయితే హర్ ఘర్ తిరంగా సర్టిఫికేట్ ను ఎలా పొందవచ్చనేది ఇప్పుడు చూద్దాం. పౌరులు అంతా జెండాతో సెల్ఫీ తీసుకుని దానిని హర్ తిరంగా.కామ్ కు అప్ లోడ్ చేయాలి. ఆ తరువాత సర్టిఫికేట్ ను సేవ్ చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

* ముందుగా hargartiranga.com వెబ్ సైట్ కి వెళ్లి అప్ లోడ్ సెల్ఫీ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
* తరువాత పేరు, ఫోన్ నంబర్, దేశం వంటి సమాచారాన్ని అందించాలి. అనంతరం సెల్ఫీని అప్ లోడ్ చేయాలి.
* పోర్టల్ లో చిత్రాన్ని ఉపయోగించడానికి అనుమతి ఇస్తున్నాను అనే విషయాన్ని అంగీకరించి ‘సబ్మిట్ ’ బటన్ పై క్లిక్ చేయాలి.
* సర్టిఫికేట్ ను రూపొందించు అనే బటన్ పై క్లిక్ చేసి.. తరువాత డౌన్ లోడ్ బటన్ ను వినియోగించి సర్టిఫికేట్ ను సేవ్ చేసుకోవచ్చు.