Hero Sharwanand: విడాకులు తీసుకోబోతున్న హీరో శర్వానంద్.. వార్తల్లో నిజమెంత?

Hero Sharwanand: చిత్ర పరిశ్రమ (Cine Industry) లో అనేక రకాల రూమర్స్ చాలానే చక్కర్లు కొడుతుంటాయన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. నటీనటులు ప్రేమించి పెళ్లిచేసుకుని కొందరు కలిసి జీవనం సాగిస్తున్నప్పటికీ మరికొందరు విడాకులు (Diverse) తీసుకుంటున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ( Telugu Film Industry) లో సైతం చాలా మంది సెలబ్రిటీలు తమ లైఫ్ పార్టనర్ లకు విడాకులు ఇచ్చారు.

పవన్ కల్యాణ్, అక్కినేని నాగచైతన్య, ఐశ్వర్య రజనీకాంత్, మంచు మనోజ్ ఇలా విడాకులు తీసుకున్న వారిలో ఉన్నారు. అయితే తాజాగా హీరో శర్వానంద్ కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గత సంవత్సరం రక్షిత రెడ్డి అనే అమ్మాయితో శర్వానంద్ వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి పండంటి ఆడబిడ్డ ఉండగా విడాకులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించుకుంటున్నారు.

అయితే శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నది నిజ జీవితంలో కాదని, సినిమాలో భాగంగా అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సామజవరగమన మూవీ డైరెక్టర్ అబ్బరాజు (Director Abbaraju) దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా విడాకుల నేపథ్యంలో తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత విడాకుల కోసం తిరిగే పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు నటిస్తున్నారని సమాచారం.