ఢిల్లీ, గురుగ్రామ్ లో బాంబు బెదిరింపు కలకలం.. అధికారుల తనిఖీలు

ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం చెలరేగింది. ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న మాల్స్ లో బాంబులు ఉన్నట్లు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది.

నోయిడా (Noida) లోని డీఎల్ఎఫ్ కు చెందిన మాల్ ఆఫ్ ఇండియా (Mall of India) మరియు హర్యానాలోని గురుగ్రామ్( Gurugrams) లోని ఆంబియెన్స్ మాల్ ( Ambience Mall) లో బాంబు బెదిరింపు (Bomb threat) వచ్చింది. ఏ ఒక్కరిని వదిలి పెట్టమంటూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు గుర్తు తెలియని ఆగంతకులు ఈ-మెయిల్ (E-Mail) పంపారు. వెంటనే అప్రమత్తమైన మాల్ అధికారులు భవనం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అదేవిధంగా మాల్ వద్దకు చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈ-మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు (Investigation) చేస్తున్నారు.