తెలంగాణ( Telangana )లో రైతు రుణమాఫీ వ్యవహారంపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ( Guarantee) ప్రకారం ఆగస్ట్ 15వ తేదీ వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెబుతోంది.అంతేకాదు మాజీ మంత్రి హరీశ్ రావు (Ex Minister Harish Rao) ప్రకటించిన విధంగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) డిమాండ్ చేస్తున్నారు.
అయితే రాష్ట్రంలో రుణమాఫీ రైతులు (Farmers) అందరికీ జరగలేదని అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) కి హరీశ్ రావు మరో సవాల్ విసిరారు. డేట్, ప్లేస్ చెప్పాలని… రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ (Challenge) చేశారు. పూర్తి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే దేనికైనా తాను సిద్దమని హరీశ్ రావు స్పష్టం చేశారు. అదేవిధంగా గతంలో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వాస్తవం కదా అని నిలదీశారు. చేసిన ఛాలెంజ్ ప్రకారం రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం (Political asceticism) స్వీకరించారా అని ప్రశ్నించారు. సంపూర్ణ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు తనకు పదవులు ముఖ్యం కాదని వెల్లడించారు. అదేవిధంగా వాస్తవ లెక్కలతో రుణమాఫీపై ప్రభుత్వం (Government) శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.