Monkeypox virus: కరోనా మహమ్మారి భయాన్ని వదలకముందే మరో వైరస్ మానవాళికి ముప్పుగా పరిణమించనుంది. ఎంపాక్స్ గా వ్యవహారించే మంకీపాక్స్ వైరస్ (Monkeypox virus ) ప్రపంచ దేశాలకు విస్తారంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మొదటిలో ఆఫ్రికా (Africa )ఖండానికే పరిమితమైన మంకీపాక్స్ 2022 సంవత్సరంలో ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలోనే మరోసారి ఈ వైరస్ వ్యాపిస్తోందన్న డబ్ల్యూహెచ్ఓ ( WHO) ఆఫ్రికా దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో కేసులు గుర్తించినట్లు తెలిపింది. మంకీపాక్స్ సోకిన మనుషుల శరీరంపై చిన్న చిన్న పొక్కులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ జంతువులు, వాటి మాంసం కారణంగా వ్యాపించిందని, మనుషుల నుంచి మనుషులకు సోకిన దాఖలాలు లేవని వెల్లడించారు. అయితే ఎంపాక్స్ జన్యు పరివర్తనాల (Genetic mutations) కారణంగా మరింత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాంగో బేసిన్ స్ట్రెయిన్ (
Congo Basin strain) గా వ్యవహరించే క్లాడ్ 1 ఎంపీఎక్స్ వి రకం వైరస్ తో మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఎంపాక్స్ వైరస్ (Empox virus) ను నియంత్రించేందుకు వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహించడంతో పాటు యాంటీ వైరల్ ట్రీట్మెంట్, వ్యాక్సిన్ తయారీ పెంచడం వంటి చర్యలు చేపట్టాలని సైంటిస్టులు (Scientists) సూచిస్తున్నారు. అదేవిధంగా వైరస్ పై పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.