Government Scheme: మహారాష్ట్ర (Maharastra) లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ -శివసేన -ఎన్సీపీ కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మహిళలకు లబ్ధి చేకూర్చుతూ.. ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన (Mukhyamantri Ladki Bahin Yojana) అనే పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 అకౌంటల్లో జమ చేయనుందని సీఎం ఏక్ నాథ్ షిండే ( CM Ek Nath Shinde ) ప్రకటించారు. కాగా రాష్ట్రంలో ఈ పథకం ద్వారా అర్హత కలిగిన దాదాపు కోటి మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. జూన్, జులై నెలతో కలిపి మొత్తం రూ.3,000 ను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. వార్షిక ఆదాయం (Annual Income) రూ.2.5 లక్షలు ఉండి.. 21 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు. అయితే ఈ పథకం అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం రూ.46,000 కోట్ల భారం పడనుంది.
ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన కింద దరఖాస్తు (Application) చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నారీ శక్తి దూత్ యాప్ (Naari Shakthi Dhuth App) లో ఆన్ లైన్ లో లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.