కర్ణాటక (Karnataka) లో నటుడు దర్శన్ (Actor Darshan) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసు (Murder Case) లో ఖైదీగా ఉన్న దర్శన్ కు జైలులో వీఐపీ సేవలు అందుతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారాయి.
ముందుగా జైలు బ్యారక్ (Prison barracks) నుంచి బయటకు వచ్చిన దర్శన్ స్నేహితులతో కలిసి కాఫీ, సిగరెట్ (Coffee, cigarettes) తాగుతున్న ఫొటో బయటకు వచ్చింది. తరువాత ఆయన తన ఫ్రెండ్ తో వీడియో కాల్ (Video Call) మాట్లాడినట్లు ఉన్న వీడియో బయటకు వచ్చింది. అయితే దర్శన్ గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా వీడియోలో ఉందని తెలుస్తోంది. దీంతో నిందితుడిగా జైలులో ఉన్న దర్శన్ కు సకల మర్యాదలు అందుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జైలు అధికారుల (Jail Officials) పై పలు అనుమానాలతో పాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్ గా మారడంతో రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ (Investigation) కు ఆదేశించారు.