చట్టానికి కట్టుబడి ఉంటా.. అల్లు అర్జున్

  • నా గురించి ఎవరూ ఆందోళన చెందొద్దు
  • సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. రిలీజైన తరువాత నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంటికి చేరుకోవడంతో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. కుటుంబ సభ్యులను కలుసుకున్న అల్లు అర్జున్ తరువాత అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ నేను బాగానే ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. చట్టాన్ని గౌరవిస్తానని తెలిపారు. అలాగే తనకు మద్ధతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఏం మాట్లాడలేనని తెలిపారు.. సంధ్య థియేటర్ లో మృతిచెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆ ఘటన దురదృష్టకరమన్న ఆయన అది అనుకోకుండా జరిగిన సంఘటన అని వివరించారు.