KONDA SUREKHA: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం.. కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.  హీరో నాగచైతన్య,  సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనని ఘాటుగా ఆరోపణలు చేశారు.  బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కేటీఆర్ కు తల్లి అక్క, చెల్లి లేరా. . హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు.

మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్‌కు అలవాటుపడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారంటూ మండి పడ్డారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లందరికీ  తెలుసునని వ్యాఖ్యానించారు.

తనపై ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు.. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి.  తప్పుచేస్తే ఎత్తిచూపాలి అంతే కాని వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. అంటూ సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.