Raithu Bharosha: తెలంగాణలో రైతుభరోసాపై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం..!!

తెలంగాణ (Telangana) లోని కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం మూడు విడత (Three Phases) ల్లో రైతులు తీసుకున్న రుణాలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం మాఫీ చేసింది. తాజాగా రైతులకు పెట్టుబడి సాయం (Investment) అందించేందుకు తీసుకువచ్చిన పథకం రైతు భరోసా. గత ప్రభుత్వం దీన్ని రైతుబంధు పేరుతో అమలు చేయగా.. ఎకరాకు రూ.5 వేలు పెట్టుబడి సాయాన్ని అందించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం పేరును మార్చడంతో పాటు పెట్టుబడి సాయాన్ని సైతం పెంచుతూ కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది. దీని ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేలు అందనున్నాయి. అలాగే ఈ మొత్తాన్ని రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని సర్కార్ భావిస్తోందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రైతుభరోసా పథకాని (Raithu Bharosha Scheme) కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన (Official Announcement) రాలేదు. కానీ దీనికి సంబంధించిన కీలక విషయం బయటకు వచ్చింది.

రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. అందుకోసం మార్గదర్శకాలు (Guidelines) ఖరారైయ్యాయని సమాచారం. అదేవిధంగా పది ఎకరాల లోపే రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా దీనిపై మరో ఇరవై రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.