”ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ , జనసేన , బీజేపీ కూటమి కేడర్ కి ఉత్సాహం రేకెత్తించే ప్రకటన ఇది . ఆయా పార్టీలలో ఇప్పటి వరకు ఎటువంటి పదవులూ లేని , కష్టపడే నేతలు , కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూటమి సర్కార్ రెడీ అయింది . ఈ మేరకు పార్టీల వారీగా నామినేటెడ్ జాబితా కూడా రెడీ అయింది . .”
సోషల్ మీడియాలో ఏపీ లో నామినేటెడ్ పోస్టుల ఎంపిక జరిగిందని . . ఒకటి , రెండు రోజులలో జాబితాను అధికారికంగా ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది . కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల పేర్లుో ఈ లిస్టులో ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి ప్రాధాన్యం ఇచ్చారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు . ఈ జాబితాలో టీటీడీ ఛైర్మన్ తో పాటు . . మరో ఇరవైకి పైగా పేర్లు వైరల్ అవుతున్నాయి .