Telangana Government: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరి కోసం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. దీని ద్వారా ఎంతోమంది రేషన్ కార్డు దారులకు ఊరట లభించనుంది.
రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు గ్రెయిన్ ఏటీఎంలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సేవలను ముందుగా హైదరాబాద్ పరిధిలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తరువాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. గ్రెయిన్ ఏటీఎం ద్వారా లబ్ధిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. 365 రోజుల పాటు రేషన్ పొందే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు సాధారణ లబ్దిదారులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఒడిశా రాష్ట్రంలో గ్రెయిన్ ఏటీఎంలు సదుపాయం అందుబాటులో ఉండగా.. వీటి ద్వారానే అక్కడ రేషన్ పంపిణీ జరుగుతుంది.