టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా (Hydra) కూల్చివేసిన ఘటన తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోందన్న సంగతి తెలిసిందే. దీనిపై స్టే ఉందని నాగార్జున చెబుతుండగా.. న్యాయస్థానం ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని, అందుకే కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత (Demolition) జరిగిన ఈ సమయంలో గతంలో నటుడు బాలకృష్ణ (Actor Balakrishna) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ (Viral) గా మారాయి. భూములు పంచుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాల (Real Estate Business) కోసం టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు కలిశారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ (Film Industry) లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం (Previous Government) తో చిరంజీవి, నాగార్జున వంటి పలువురు ప్రముఖులు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఆ సమయంలో చర్చలకు బాలయ్యను ఎవరు ఆహ్వానించలేదు. దీనిపై మండిపడిన బాలకృష్ణ వాళ్లంతా భూములు పంచుకుంటున్నారని, ప్రభుత్వంతో చర్చలు కూడా వాళ్ల వ్యాపారాల కోసమంటూ పలు ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత (N Convention Demolition) జరిగిన సమయంలో బాలయ్య వ్యాఖ్యల (Balayya comments) ను కొందరు సోషల్ మీడియా (Social Media) లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతంలో ఆయన చెప్పిన వ్యాఖ్యలే నిజమంటూ కామెంట్స్ చేస్తున్నారని సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.