‘హిందూధర్మ పరిరక్షణ’ అందరి బాధ్యత – హైందవ శంఖారావం.. సక్సెస్
ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, దేవదాయ-ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని హైందవ శంఖారావం సభ డిమాండ్ చేసింది. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన శంఖారావానికి హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు విచ్చేశారు. భారీసంఖ్యలో హిందువులు తరలివచ్చారు. కాషాయ జెండాల రెపరెపలతో సభా ప్రాంగణం కళకళలాడింది. హిందూధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆధ్యాత్మికవేత్తలు పిలుపునిచ్చారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి కాషాయవర్ణం సంతరించుకుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ … Read more