Ratan Tata – Funeral-Last rites: రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి

పారిశ్రామిక దిగ్గజం, మానవతావాది రతన్ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లి శ్మశానవాటికలో ముగిసాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించింది. మహారాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. రతన్‌ టాటా అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు అధిపతిగా … Read more

BharataRatna – Ratan Tata: రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’.. మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం

ముంబై: రతన్ టాటా మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రతన్ టాటా కృషికిగానూ భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరే ప్రతిపాదనను కూడా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. కాగా దేశం గర్వించే వ్యాపారవేత్త రతన్‌ టాటాకు ‘భారత రత్న’ పురస్కారం ఇస్తే … Read more

Ratan Tata: రతన్ టాటా ప్రేమ కథ తెలుసా?

అంతర్జాతీయంగా పారిశ్రామికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొందిన రతన్ టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? ఆయనకు ఒక మంచి ప్రేమ కథ ఉందని తెలుసా? ప్రేమ విషయాన్ని  ఆయనే ఒకసారి స్వయంగా వెల్లడించారు. రతన్ టాటా తాత పేరు రతన్‌జీ టాటా. రతన్ టాటా తండ్రి నావల్ టాటాను ఓ అనాథాశ్రమం నుంచి రతన్‌జీ, ఆయన తొలి భార్య సూనూ దత్తత తీసుకున్నారు. స్విట్జర్లాండ్ జాతీయురాలైన సిమోన్‌ను ఆ తర్వాత నావల్ టాటా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ … Read more

Ratan Tata: వ్యాపార దిగ్గజం ర‌త‌న్ టాటా క‌న్నుమూత‌

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూపు సంస్థల అధిపతి రతన్ టాటా(86) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30ని.లకు ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను టాటా స‌న్స్ గ్రూప్ చైర్మన్ ఎస్.చంద్ర‌శేఖ‌ర‌న్ ధ్రువీక‌రించారు. రతన్ టాటా పలు అనారోగ్య సమస్యల వల్ల బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే రతన్ టాటా ఆరోగ్య‌ పరిస్థితి పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూనే క‌న్నుమూశారు. రతన్ టాటా … Read more