Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు: మంత్రి కోమటిరెడ్డి

మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కాళ్లు, చేతులు వంకరలు పోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్పిపోతుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మూసీ ప్రక్షాళనను అన్యాయంగా అడ్డుకొని తమను బద్నాం చేయాలని చూస్తున్నారని  విపక్షాలపై ఆగ్రమం వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని, … Read more

Hyderabad: ఆ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే.  నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వారు. వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నా చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25వేలు ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు … Read more