Donald Trump: కొన్ని దేశాల‌పై దిగుమతి పన్నులు పెంచిన ట్రంప్

అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప‌లు దేశాల నుంచి దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల ప‌న్నుల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. ప్ర‌ధానంగా కెన‌డా, మెక్సికో, చైనా వ‌స్తువుల‌పై ప‌న్నుల పెంపున‌కు ఆయ‌న సిద్ధమ‌య్యారు. మెక్సికో, కెన‌డాల‌పై 25 శాతం… చైనాపై 10 శాతం ప‌న్నులు విధించే ప‌త్రాల‌పై జ‌న‌వ‌రి 20న సంతకాలు చేయ‌నున్న‌ట్లు సోమ‌వారం ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్రూత్ సోషల్ మీడియా వేదిక‌గా ఒక పోస్ట్ చేశారు. చ‌ట్ట విరుద్ధ‌మైన వ‌ల‌స‌లు, … Read more

China: చైనాలో ఎనిమిది మందిని కత్తితో పొడిచిన విద్యార్థి

చైనాలో ఓ యువకుడు శనివారం ఉన్మాదిగా ప్రవర్తించి ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. మరో 17 మందిని గాయపర్చాడు. ఈ ఘటన చైనా తూర్పు నగరం వుషీలో జరిగింది. 21 సంవత్సరాల యువకుడు కళాశాల క్యాంపస్‌లో కత్తితో వీరంగం సృష్టించాడు. విచక్షణారహితంగా కత్తితో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో  8 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వుషీ  వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ … Read more

Leaves: మనసు బాలేదా? అయితే సెలవు తీసుకోండి.!ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌..

చైనా: ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లినా అన్యమనస్కంగానే పనిచేస్తారు. అయితే మనసు బాలేనప్పుడు ఆఫీసుకు రావద్దంటోంది ఓ కంపెనీ. ఆరోజు సెలవు తీసుకోమంటోంది. సూపర్‌ కదా… అర్జంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా.. ఆగండాగండి.. ఇది ఇండియాలో కాదు.. చైనాలో. చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ … Read more