Nara Ramamurthy Naidu: రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో తరలించనున్నారు. ఇప్పటికే ఆయన భౌతికకాయం ఏఐజీ ఆసుపత్రి నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంది. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు.  రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆయన మరో ప్రత్యేక విమానంలో … Read more

Ratan Tata: దార్శనికుడు రతన్ టాటా.. చంద్రబాబు నివాళి

”దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా దార్శనికుడు. ఆ మహనీయుడి సేవాతత్పరతను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుంది.. టాటా స్పూర్తిని మనమంతా కొనసాగించాలి..” అని ఆంధ్రప్రదేశ్ సీయం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముంబాయ్ లో ఎన్సిపిఏ గ్రౌండ్స్లో గురువారం రతన్ టాటా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా రతన్ టాటా దేశానికి చేసిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పారిశ్రామిక వేత్త్తలు టాటాల మాదిరిగా నైతికంగా సంస్తలను నిర్వహించాలని హితవు పలికారు.