బాబోయ్.. చలి.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు..

రెండు తెలుగు రాష్టాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వాతావరణ శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఏపీలోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి గజగజలాడిస్తోంది. నాలుగు గంటలకే దట్టమైన మంచుకప్పేసి మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలు చింతపల్లిలో నమోదయింది. ఉదయం పది అయితే గాని మంచు తెరలు వీడడం లేదు. చలి మంటలు వేసుకుంటు ఉపశమనం పొందుతున్నారు స్థానిక గిరిజనం. … Read more

ఆక్వా రైతులూ …ఆందోళన వద్దు . .

అక్వా రైతుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం పర్యటించి ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు హామీ ఇచ్చారు. విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. విద్యుత్ … Read more

Anitha: శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్.. రెచ్చిపోయిన హోం మంత్రి అనిత

రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాల అంశంపై ఏపీ శాసన మండలిలో రచ్చ రగిలింది. వైపీపీ, కూటమి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. దీనిపై వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై హోంమంత్రి అనిత గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై కూడా కేసులు పెట్టారని … Read more

Aadhar: ఆధార్ లో పుట్టిన తేదీ మార్పుపై సడలింపు

ఆధార్ కార్డ్ లో పుట్టిన తేదీ సడలింపులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డు కొనుగోలు చేయడం నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇంతటి కీలకమైన కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులైన వృద్ధులు పుట్టిన తేదీ నమోదులో, మార్పులు చేర్పులు చేయడానికి అవస్థ పడే పరిస్థితి నెలకొంది. వయసు నిర్ధారణ విషయంలో ప్రూఫ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఆధార్ … Read more

Nitin Gadkari: రూ.400 కోట్లతో 12రోడ్ల అభివృద్ధి

ఏపీలో పలు రోడ్ల అభివృద్ధికి రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు.   ఎక్స్ వేదికగా ఆయన కొన్ని వివరాలు తెలిపారు.  200.06 కిలో మీటర్ల పొడవైన 12 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) నుండి ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గుంటూరు – నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్వోబీని నాలుగు … Read more

liquor shops: మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ

నూతన మద్యం పాలసీలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దుకాణాలను అప్పగించేందుకు  చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.  రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు … Read more

AP News: ఇసుక విధానం ప్రచారంపై  చంద్రబాబు ఫైర్..

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఉచితంగా ఇసుక అని హామీ ఇచ్చారు. అందులో భాగంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నారు. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదని,  ఆన్‌లైన్ ద్వారా లోడింగ్, అన్ లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు మాత్రం చెల్లించి ఇసుక పొందే అవకాశం కల్పించామని చెపుతున్నారు. అయితే ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. దాని మీద … Read more

New liquor policy: ఏపీలో ప్రైవేట్ మద్యం షాపులు.. క్వార్టర్ రూ.99కే..

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  అదే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. అది కూడా దసరా పండుగకు ముందే.  ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ విషయం మీడియాకు వెల్లడించారు.  గత ప్రభుత్వం మద్యం విధానం ద్వారా  దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.  ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు వైస్ షాపులు నడిచేలా  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చింది.   దాని ప్రకారం  అక్టోబర్ 12 … Read more