ఆక్వా రైతులూ …ఆందోళన వద్దు . .

అక్వా రైతుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం పర్యటించి ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు హామీ ఇచ్చారు.

విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లుగా కొత్త సబ్ స్టేషన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. హేచరీల యాజమాన్యాలతో సమావేశమై వారిపై ఆర్ధిక భారం పడకుండా సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఆక్వా సమస్యలపై అసెంబ్లీలో చర్చించామని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.