కోల్కతా (Kolkata) ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ( Justice DY Chandra Chude) నేతృత్వంలోని జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది.
అయితే ఈ కేసును ఇప్పటికే కోల్కతా హైకోర్టు ( Kolkata High Court) ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. హత్యాచార ఘటనలో ప్రిన్సిపల్ పాత్రపై సీబీఐ అధికారులు (CBI Officials) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా ఆగస్ట్ 9న కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) లో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు (Main Accused) సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హత్యాచార ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.