”కాలం చెల్లిన బ్రిటిష్ పాలన నాటి ఓ పట్టణం పేరును మన సాంప్రదాయ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది . .”
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ (Andaman And Nicobar Islands) రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ (Port Blair) పేరును శ్రీ విజయ పురం (Sri Vijaya Puram)గా మార్చింది. పురాతన శ్రీ విజయ సామ్రాజ్యం స్ఫూర్తి, ఆ ప్రాంతంతో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు గౌరవం కల్పించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వలస పాలకుల ముద్ర నుంచి దేశానికి విముక్తి కల్పించాలనే ప్రధాన నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును ‘శ్రీ విజయం పురం’గా మారుస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసారు . అండమాన్ నికోబార్ దీవులకు మన స్వాతంత్ర పోరాటంలో, చరిత్రలో సుస్థిర స్థానం ఉందని, ఒకప్పుడు చోళ సామ్రాజ్యం ‘నావికా స్థావరం’ ఈ ఐలాండ్ ప్రాంతం సేవలందించిందని, ఈరోజు మన దేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా కీలక స్థావరం నిలిచిందని అమిత్‌షా ఈ సందర్బంగా అభివర్ణించారు. మన త్రివర్ణ పతాకాన్ని తొలుత ఇక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎగురవేశారని, దేశ స్వాతంత్ర్య కోసం పోరాడిన వీర సావార్కర్ వంటి పలువురు యోధులు ఇక్కడి జైలులో ఉన్నారని అమిత్‌షా గుర్తుచేశారు.