ఎన్డీయే జోరు తగ్గలేదు …

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు – మెజారిటీ స్థానాల్లో NDA గెలుపు ఎన్డీయే జోరు కొనసాగుతోందనడానికి ఇటీవల జరిగిన 13 రాష్ట్రాల అసెంబ్లీ , రెండు పార్లమెంట్ ఉప ఎన్నికలే నిదర్సనం . మోడీ హవా దేశ రాజకీయాలలో కంటిన్యూ అవుతూనే ఉందనడానికి తాజా ఎన్నికల ఫలితాలే ఉదాహరణ.  దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల … Read more

Maharashtra Results: మహారాష్ట్రకు కాబోయే సీఎం పడ్నవీస్ ?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఏకంగా 216 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులే 149 చోట్ల ముందంజలో ఉన్నారు. ఇది మ్యాజిక్ ఫిగర్ (145) కన్నా ఎక్కువ కావడంతో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పదవిపై సందిగ్ధత తొలగినట్లే కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత ప్రవీణ్ ధరేకర్ ప్రకటన కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఫడ్నవీస్ సీఎం పదవి చేపడతారని కాసేపటి క్రితం ఆయన … Read more

Gautam Adani: అదానీకి సెబీ షాక్.. విచారణ ప్రారంభం!

ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతం అడానిపై అమెరికాలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ పేరుతో సెబీ షాకిచ్చింది. సోలార్ పవర్ కాంట్రాక్ట్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల అత్యున్నత స్థాయి వ్యక్తులకు దాదాపు రూ. 2,200 కోట్ల లంచం ఇచ్చినట్టు అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులపై అమెరికాలో అభియోగాలు నమోదైన వేళ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రంగంలోకి దిగింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ … Read more

Priyanka Gandhi: 2 లక్షలకు పైగా మెజార్టీలో ప్రియాంకాగాంధీ

నాయకురాలు ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె ఆదిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో ప్రియాంకపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్య మొకేరి పోటీలో ఉన్నారు.  వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 4.3 లక్షల మెజార్టీతో … Read more

Zomato CEO: జొమాటోలో అత్యున్నత ఉద్యోగం.. 20 లక్షలు మనమే కట్టాలి

జొమాటో సీఈఓ చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. అందరూ దానిపై ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారిగా ఆయన మీడియాలో మెరిశారు. జొమాటోలో అత్యున్నత పోస్టుకు తెలి వైన, చురుకుదనం, నేర్చుకోవాలనే తపన ఉన్న అభ్యర్థి కావాలని సీఈఓ దీపిందర్ గోయెల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సంస్థలోనే అత్యున్నత పోస్టు అంటున్నారు కాబట్టి జీతం కూడా భారీగానే ఉంటుందని అనుకోవడం సహజం. అయితే ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా చెల్లించబోమని … Read more

Delhi Air Quality: ఢిల్లీలో కాలుష్య భూతం .. భయం భయంగా జనం . ..

దేశరాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచిక) ఏకంగా 494కు పెరిగింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. గాలి నాణత్య సూచీ 450కు తగ్గినా సరే తమ అనుమతి లేకుండా ఆంక్షలు ఎత్తివేయవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ ఏకంగా 500 … Read more

Womens Entrepreneur : మహిళల వ్యాపారానికి సర్కార్ సాయం . .రూ. 5 కోట్లు

పురుషులతో అన్ని రంగాలలోనూ మన మహిళలు పోటీ పడుతున్నారు. ఇటీవల వ్యాపారాలలోను దూసుకుపోతున్నారు . మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి కేంద్ర సర్కార్ అనేక సహకారాలు అందిస్తోంది. రుణాలే కాకుండా సబ్సిడీ కూడా ఇవ్వడంతో మహిళ ఎంటర్ ప్రెన్యూర్స్ కి భుజం తట్టినట్లనిపిస్తోంది . మహిళలకు బిజినెస్ హెల్ప్ అంటే . .. చిన్న చిన్న కుట్టుమిషన్లు , అప్పడాలు , వడియాల తయారీలకే కాదు . .. మార్కెట్ లో ఎదుగుదలకు ఛాన్స్ ఉన్న (నైతికంగా … Read more

ఢిల్లీ కాలుష్యం..స్టేజ్-4 ఆంక్షలు

రోజురోజుకీ వేగంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కార్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది .  దేశ రాజధాని నగరం దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంపై ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించినప్పటికీ, తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ -4’ (GRAP-IV) కింద మరిన్ని … Read more

హైపర్ సోనిక్ సక్సెస్

భారత్ అంబుల పొడిలో మరో రామబాణం వచ్చి చేరింది . ”ఒడిశా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి, లాంగ్ రేంజ్ హైపర్‌సోని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది” అని రక్షణ మంత్రి X ద్వారా తెలిపారు . “ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ ముఖ్యమైన విజయం. అలాంటి క్లిష్టమైన, అధునాతన సైనిక సాంకేతికతలను కలిగి ఉన్న, దేశాల సమూహంలో మన దేశం కూడా చేరింది” … Read more

Narendra Modi: నైజీరియా చేరుకున్న మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియాకు చేరుకున్నారు. నైజీరియాలో మోదీ పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. ప్రధాని రాక నేపథ్యంలో అక్కడ సందడి నెలకొంది. నైజీరియాలో నివసిస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో అబుజా ఎయిర్ పోర్టుకు చేరుకుని మోదీకి ఆహ్వానం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. వారికి కరచాలనం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. మరోవైపు ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీ ఇంత ఆత్మీయంగా, ఉత్సాహభరితంగా … Read more