ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Aravind Kejriwal) బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు( Supreme Court) లో విచారణ జరగనుంది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్( Petition) పై విచారణ చేపట్టనుంది.
కాగా కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ అఫిడవిట్ (Counter Affidavit) దాఖలు చేసింది. ఈ క్రమంలోనే లిక్కర్ స్కాం(Liquor Scam) లో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని సీబీఐ (CBI) పేర్కొంది. అలాగే మద్యం పాలసీకి సంబంధించిన దర్యాప్తు సంస్థ అడిగిన ప్రశ్నలకు కేజ్రీవాల్ సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించింది. విచారణ (Investigation) ను సైతం తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో ఇవాళ విచారణ అనంతరం కేజ్రీవాల్ కు సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.