Medicine : 156 రకాల మందులపై కేంద్రం నిషేధం..!!

జ్వరం, ఎలర్జీ మరియు నొప్పుల కోసం ఉపయోగించే మందులపై కేంద్రం నిషేధం (Center Banned) విధించింది. ఈ మేరకు సుమారు 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (Fixed Dose Combination) మందులను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.

యాంటీ బ్యాక్టీరియల్ మందులు (Antibacterial drugs) కూడా ఈ జాబితాలో ఉన్నాయని తెలుస్తుండగా.. వీటిని వాడటం వలన హాని జరిగే అవకాశం ఉండటంతో నిషేధించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) ను ఈ నెల 12వ తేదీన కేంద్రం జారీ చేసింది. అయితే రెండు లేదా మూడు క్రియాశీలక పదార్థాల నిర్ధిష్ట నిష్పత్తిలో ఉండే మందులను ఎఫ్డీసీ మందులు లేదా కాక్టెయిల్ డ్రగ్స్ ( cocktail drugs) అని పిలుస్తుంటారు. కాగా నొప్పుల కోసం ఉపయోగించే అసెక్లోఫెనాక్ 50 ఎంజీ + పారాసిటమాల్ 125 ఎంజీ ట్యాబ్లెట్ కాంబినేషన్ కూడా నిషేధానికి గురైన మందుల జాబితా (Medicine List) లో ఉంది.