ఏపీ (AP State) వ్యాప్తంగా పలు పంచాయతీల్లో గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సుమారు 13,326 గ్రామ పంచాయతీలలో ‘‘ స్వర్ణ గ్రామ పంచాయతీ (Swarna Grama Panchayat)’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం( Government) శ్రీకారం చుట్టింది.
కాగా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో చేపట్టే ఈ సభలన్నీ ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన జరగనున్నాయి. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) పాల్గొననున్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా(Annamaiah) రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) గ్రామ సభకు హాజరుకానున్నారు.
గ్రామసభల్లో ముఖ్యంగా నాలుగు అంశాలను గ్రామస్థులతో చర్చించనున్నారు. అందులో మొదటి అంశం మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, కుళాయి మరియు వంటగ్యాస్ కనెక్షన్లు. రెండో అంశంలో మురుగునీరు, వీధి దీపాలు, సిమెంట్ ఫలితాలు ఉండగా.. మూడో అంశంలో గ్రామాల్లో రోడ్ల నిర్మాణం మరియు మండల కేంద్రాలకు లింక్ రోడ్లపై చర్చించనున్నారు. ఇక ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణం మరియు పశువుల పెంపకం వంటి అంశాలు నాలుగో దానిలో ఉండనున్నాయని వీటిపై వివరాలను సేకరించనున్నారని సమాచారం.