Tirumala Laddu Issue : సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వ్యవహారం…

కోట్ల మంది హిందువుల విశ్వాసాలపై ప్రసాదం కల్తీ ద్వారా దెబ్బకొట్టిన వైనంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది . తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించారనే వివాదం అత్యున్నత న్యాయ స్తానం   సుప్రీంకోర్టుకు  చేరింది. హిందూ మతాచారాలను అతిక్రమించిన ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు   ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌‌కి సత్యం సింగ్ అనే న్యాయవాది లేఖ రాశారు. తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల … Read more

Punganur Cow: ప్రధాని నివాసంలో పుంగనూరు

పుంగనూరు .  మోదీ వీడియోతో మరోమారు దేశవ్యాప్తంగా గో ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకూండా పోయింది . పుంగనూరు.. ఇపుడు దేశవ్యాప్తంగా గో ప్రేమికుల నోట వినిపించే పేరు ఇది .  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పుంగనూరు లేగ దూడను చూడటం తనకు ఎంతో  ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మోదీ నామకరణం చేసిన ”దీపజ్యోతి” లేగదూడ ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిందని లోకేష్ ట్వీట్ చేసారు .    … Read more

Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రధాన డోమ్ లీక్.. చుట్టుముట్టిన వరద

తాజ్ మహల్ చిక్కుల్లో పడింది .  ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ (Taj Mahal) కట్టడాన్ని వరద చుట్టుముట్టింది. తాజ్ మహల్ ప్రధాన డోమ్ కూడా లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో గడిచిన మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 17వ శతాబ్దపు అద్భుత కట్టడం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ ప్రధాన డోమ్‌ వద్ద నీరు … Read more

Port Blair Renamed: పోర్ట్ బ్లెయిర్ ఇకనుంచి శ్రీ విజయపురం.. ప్రకటించిన అమిత్‌షా

”కాలం చెల్లిన బ్రిటిష్ పాలన నాటి ఓ పట్టణం పేరును మన సాంప్రదాయ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది . .” కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ (Andaman And Nicobar Islands) రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్‌ (Port Blair) పేరును శ్రీ విజయ పురం (Sri Vijaya Puram)గా మార్చింది. పురాతన శ్రీ విజయ సామ్రాజ్యం స్ఫూర్తి, ఆ ప్రాంతంతో ఉన్న … Read more

modi controversy issue: సీజేఐ ఇంటికి ప్రధాని….చెల రేగిన మోదీ వివాదం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ నైతికతను పక్కన పెట్టి న్యాయవ్యవస్థపై సైతం సామాన్యులకు అనుమానం కలిగే రీతిలో వ్యవహరించారు .  దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి . సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నివాసంలో (న్యూ ఢిల్లీ )  జరిగిన గణపతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడంతో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంపై … Read more

Sitaram Yechury: సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఐ జాతీయ  ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి గురువారం కన్నుమూశారు .   వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు .    ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు-19న ఎయిమ్స్‌‌లో చేరిన ఏచూరి.. గురువారం నాడు (సెప్టెంబర్-12న) సాయంత్రం మరణించారు. సీతారామ్  మరణంతో కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఏచూరి సీతారాం సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ .  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ … Read more

70 ఏళ్లు పైబడిన వారందరికీ.. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా

ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకం ఇకపై దేశంలో 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా ఈ స్కీం లో అర్హులే .    ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌లో తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్‌ … Read more

Arunachal:అరుణాచల్‌లోకి చైనా సైన్యం!

డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు బరితెగించింది .   భారత్‌లోని ఈశాన్య రాష్ట్ర0  అరుణాచల్‌ప్రదేశ్‌ తమదే అంటూ తరచూ కయ్యానికి దిగే చైనా.. ఇటీవల ఏకంగా ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టినట్లుగా కూడా ఇంటిలిజెన్స్ వర్గాలు . అనుమానిస్తున్నాయి .    డ్రాగన్‌ సైన్యం అరుణాచల్‌లోని అంజా జిల్లాలో 60 కిలోమీటర్ల మేర లోపలకు వచ్చినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కపాపు ప్రాంతంలో కొద్ది రోజుల పాటు మకాం వేసినట్లుగానూ అందులో పేర్కొన్నారు. చైనా సైన్యం మంటలు వేసినట్లు,   ఆహారం … Read more

..Uttarakhand Devotee — Ramakoti: 35కోట్ల సార్లు ‘రామ’నామం!

 ఉత్తరాఖండ్  అల్మోడా జిల్లాలోని మౌలేఖల్‌ గ్రామానికి చెందిన శంభు దయాళ్ అనే వ్యక్తి  టీ దుకాణం  నడుపుతున్నాడు. అందులో 2-3 మాత్రమే కూర్చొని టీ తాగొచ్చు. ఎవరైనా ఫకీర్ లేదా పేదవాడు తన దుకాణానికి వచ్చి టీ తాగితే శంభు డబ్బులు తీసుకోడు. శంభు దయాళ్​కు భార్య దేవకీదేవి, నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు దివ్యాంగులు. “రామయ్య దయతోనే నా కుటుంబం బతుకుతోంది. నా గురువు నుంచి ప్రేరణ పొంది గత 35ఏళ్లుగా రామనామాన్ని రాస్తున్నాను. … Read more

Chhattisgarh: చెట్టు కింద కూర్చున్నారు . .పిడుగు పడింది . . అంతే .

”చెట్టు కింద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు .  ఇది వాళ్లకి రెగ్యులర్ .  కానీ ఆ రోజే అది చివరి రోజు అని మాత్రం గ్రహించలేకపోయారు .  పిడుగుపాటుకు చెట్టుకుంద కూర్చుని మాటల్లో ఉన్న ఏడుగురు క్షణాలలో చనిపోయారు . .” ఛత్తీస్‌గఢ్​లోని బలోదాబాజార్ భటపరా జిల్లాలో విషాదం నెలకొంది. మొహతారా గ్రామంలో పిడుగుపాటుకు గురై ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను అధికారులు … Read more