సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు సినీ వర్గాల సమాచారం. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెపుతున్నారు .
మరోవైపు రజనీకాంత్ గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను చేయించుకునేందుకు ఆస్పత్రిలో చేరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మంగళవారం (అక్టోబర్ 1) ఈ పరీక్షలు చేస్తారట. అందుకే సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు తమిళ చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏదేమైనా రజనీ కాంత్ ఆస్పత్రిలో చేరడంపై వైద్యుల నుంచి గానీ, రజనీ కాంత్ కుటుంబం నుంచి గానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఫ్యాన్స్‌లో ఆందోళన అక్కర్లేదు . . – రజనీ హాస్పిటల్‌లో ఎందుకు చేరారు?? కరెక్ట్ సమాచారం తెలియకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెపుతున్నారు.