Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లి గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు, ఎవరు ప్రభాస్ పెళ్లి కోసం మాట్లాడినా అది సంచలనంగానే మారుతోంది. అభిమానుల ఆసక్తి కూడా పెరుగుతుంది. అయితే ఆ రోజు త్వరలోనే వస్తుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పడం మళ్లీ ప్రభాస్ పెళ్లి అంశం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

దేవీ నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు ఆమె స్పందించారు. అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుందని చెప్పారు.

అమ్మవారి ఆశీస్సులతోపాటు కృష్ణంరాజు దీవెనలు కూడా ప్రభాస్‌పై ఎప్పటికీ ఉంటాయని చెప్పడం  అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కాబోయే వదిన ఎవరో? అంటూ అప్పుడే వెతుకులాట మొదలెట్టేశారు. ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ రానుంది.  ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలో నటిస్తున్నాడు.